
గాసిప్స్

అన్షు, వాసవి గణేశన్ జంటగా నటించిన కొత్త తెలుగు చిత్రం ‘హుషార్ పిట్టలు’. బిక్షు దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకట్ యాదవ్ నిర్మించారు. ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. యువత, ప్రేమ, కుటుంబ బంధాలు, జీవితంలో తీసుకునే నిర్ణయాల చుట్టూ కథ సాగనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
‘‘ఏ ప్రేమ కావాలి.. కన్నవాళ్లదా.. ప్రేమించిన వాళ్లదా..’’ అంటూ వచ్చే డైలాగ్ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లిదండ్రుల ఆశలు, ప్రేమించిన వ్యక్తితో బంధం మధ్య యువత ఎదుర్కొనే భావోద్వేగ సంఘర్షణను ఈ డైలాగ్ ప్రతిబింబిస్తోంది. యువతకు కనెక్ట్ అయ్యే అంశాలతో రూపొందిన ‘హుషార్ పిట్టలు’ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!