

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సెవతా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తన అల్లుడు ప్రకర్ త్రివేదిపై సంచలన ఆరోపణలు చేశారు. నకిలీ పేర్లు, గుర్తింపులను ఉపయోగించి పలువురు మహిళలను మోసం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. తన కుమార్తె ప్రగ్యాకు 2024లో ప్రకర్ త్రివేదితో వివాహం జరిపించామని, ఆ సమయంలో అతడి తండ్రి అనుజ్ త్రివేది ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పరిచయం చేసుకున్నారని, గత నేర చరిత్ర, కేసులను దాచిపెట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి అనుజ్ త్రివేది, ప్రకర్ త్రివేదిలను అరెస్ట్ చేశారు.
ప్రకర్ త్రివేది వివిధ రాష్ట్రాల్లో పలువురు మహిళలను నకిలీ గుర్తింపులతో మోసం చేసి, వారి నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు జ్ఞాన్ తివారీ ఆరోపించారు. దాదాపు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడని కూడా ఆయన పేర్కొన్నారు. వివాహం జరిగిన రెండున్నరేళ్ల తర్వాత సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా ప్రకర్ వ్యవహారాలు తమ కుటుంబానికి తెలిసినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటన తమ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసిందని, నిందితులు దోషులుగా తేలితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!