10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

Writer: Chandrika 11:17 AM, 10 ఆగస్టు, 2026
సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

కెనడాలోని విక్టోరియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టొరంటో వెళ్లాల్సిన పోర్టర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఓ చిన్నారి సీట్‌బెల్ట్‌ పెట్టుకోవడానికి నిరాకరించడంతో రద్దయింది. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో విమానంలోని చిన్నారి సీట్‌బెల్ట్‌ పెట్టుకోకుండా సీటుపై నిల్చోవడాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో చిన్నారి తల్లి, క్యాబిన్‌ సిబ్బంది కలిసి కొన్ని నిమిషాల పాటు సీట్‌బెల్ట్‌ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే చిన్నారి ఏడుస్తూ, మారాం చేయడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. సీట్‌బెల్ట్‌ లేకుండా విమానం టేకాఫ్‌ చేయడం సురక్షితం కాదని భావించిన సిబ్బంది విమానాన్ని టెర్మినల్‌కు తిరిగి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

అనంతరం చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులను విమానం నుంచి దించేశారు. నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి, ఫ్లైట్‌ ప్లాన్‌ను తిరిగి దాఖలు చేసే సమయానికి రాత్రి 12:30 గంటలు దాటింది. అప్పటికే రన్‌వే మూసివేయడంతో విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. మరుసటి రోజు అదే విమానంలో వారిని గమ్యస్థానాలకు తరలించారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి పోర్టర్‌ ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ కుమారుడుకి కారు ప్రమాదం

చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ కుమారుడుకి కారు ప్రమాదం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

ట్యాగ్లు
పోర్టర్‌ ఎయిర్‌లైన్స్‌కెనడా విమానంవిమాన సర్వీసు రద్దుసీట్‌బెల్ట్‌ నిబంధనలువిక్టోరియా విమానాశ్రయంటొరంటో విమానంవిమానయాన వార్తలువిమాన భద్రతఏవియేషన్‌ న్యూస్‌కెనడా వార్తలు
Advertisement
న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు
రాజకీయాలు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దు!
జనరల్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దు!

హర్మూజ్‌లో మళ్లీ కలకలం.. చమురు నౌకపై క్షిపణి దాడి
జనరల్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం.. చమురు నౌకపై క్షిపణి దాడి

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..
సినిమాలు

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్
జనరల్

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
జనరల్

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

హోటల్‌ ఫ్రీ వైఫైతో జాగ్రత్త - మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక
జనరల్

హోటల్‌ ఫ్రీ వైఫైతో జాగ్రత్త - మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

మెరుపులు, కొండలు, యాక్షన్.. ‘ఇంద్రపుత్ర’పై భారీ అంచనాలు!
సినిమాలు

మెరుపులు, కొండలు, యాక్షన్.. ‘ఇంద్రపుత్ర’పై భారీ అంచనాలు!

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ
క్రీడలు

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ

చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ కుమారుడుకి కారు ప్రమాదం
జనరల్

చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ కుమారుడుకి కారు ప్రమాదం

ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు
జనరల్

ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

వార్మప్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల జోరు.. సితాన్షు కొటక్‌ ప్రశంసలు
క్రీడలు

వార్మప్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల జోరు.. సితాన్షు కొటక్‌ ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!