

వారణాసి చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ పనులు ఎలాంటి అంతరాయం లేకుండా వేగంగా సాగుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మారుతున్నా షూటింగ్ షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా చిత్ర బృందం ముందుకు వెళ్తోంది. ఇటీవల వారణాసిలో కీలక షెడ్యూల్ విజయవంతంగా పూర్తైనట్లు సమాచారం.
వారణాసి షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ గ్రాండియర్‌కు సంబంధించిన కీలక భాగాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొంత భాగం మాత్రమే షూటింగ్‌కు మిగిలి ఉండగా, జూలై నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి చేయాలని రాజమౌళి ప్రణాళిక రూపొందించారట. హాలీవుడ్ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా, విడుదల తేదీని మార్చే ఆలోచన లేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!