

బాలీవుడ్ నటి శనయా కపూర్ తన సినీ ప్రయాణం, కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో శనయా ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం వాస్తవానికి ఈ సిరీస్‌తోనే ప్రారంభమైందని చెప్పారు. కెరీర్ ప్రారంభంలో ‘ఆంఖో కీ గుస్తాఖియాన్’, ‘తూ యా మై’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, వాటికంటే ముందే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సిరీస్‌కు సంతకం చేసినట్లు వెల్లడించారు.
ఆ సినిమాలు త్వరగా పూర్తై విడుదలైనప్పటికీ, ఈ సిరీస్ ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టిందని శనయా తెలిపారు. సాధారణంగా తన సినిమాలు విడుదలయ్యే సమయంలో తీవ్ర ఆందోళనకు గురవుతానని, ఒత్తిడి కారణంగా నిద్ర కూడా పట్టదని చెప్పారు. ఈ సిరీస్ విషయంలోనూ అదే భయాన్ని ఎదుర్కొన్నానని వివరించారు. అయితే సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇక శనయా త్వరలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జాంబిరెడ్డి 2’ చిత్రంలో కనిపించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!