

ప్రభాస్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో అలా ‘రాజాసాబ్’ సినిమాలో కనిపిస్తారని దర్శకుడు మారుతి తెలిపారు. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో మాళవిక మోహన్, రిద్దికుమార్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ‘రాజాసాబ్’ శుక్రవారం(jan 9th) ప్రేక్షకుల ముందుకు రానుండగా, గురువారం రాత్రి నుంచే ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ, దాదాపు ఏడాదిన్నర పాటు ‘రాజాసాబ్’ భవంతి సెట్ తమకు ఇంటిలా మారిపోయిందన్నారు. తమన్ తన సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని ప్రశంసించారు. ప్రేక్షకులు ఎంత ఎనర్జీతో థియేటర్లోకి వెళ్తారో, అంతకంటే ఎక్కువ ఆనందంతో బయటకు వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, హారర్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ వంటి అన్ని రకాల భావోద్వేగాలు ‘రాజాసాబ్’లో ఉన్నాయని తెలిపారు. భారతీయ సినిమాలో ఇంత పెద్ద స్థాయిలో హారర్ ఫాంటసీ చిత్రం ఇదే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిద్దికుమార్, కృతి ప్రసాద్, సంగీత దర్శకుడు తమన్, నిధి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!