

రాశి ఖన్నా మాట్లాడుతూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా, హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల మరో కథానాయికగా నటిస్తున్నారు. సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. మీడియాతో మాట్లాడిన రాశి ఖన్నా, పవన్ కళ్యాణ్ సినిమా అని తెలిసిన వెంటనే కథ కూడా వినకుండా వెంటనే ఒప్పుకున్నానని తెలిపారు.
ఈ సినిమాలో తాను “శ్లోక” అనే మోడరన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తానని చెప్పారు. ఇందులో ఒక మాస్ సాంగ్ కూడా ఉందని, ఆ పాట షూటింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేశానని అన్నారు. పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ వ్యక్తి అని, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారని తెలిపారు. ఆయనతో కలిసి పని చేయడం ద్వారా మానవత్వం, ప్రజాసేవ వంటి విలువలను నేర్చుకున్నానని చెప్పారు. దర్శకుడు హరీష్ శంకర్ మాస్ ప్రేక్షకుల అభిరుచిని బాగా అర్థం చేసుకునే దర్శకుడని ప్రశంసించారు. ఈ సినిమాలో అభిమానులు మళ్లీ వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను చూస్తారని, ఉగాది సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి థియేటర్లో చూడదగ్గ సినిమా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!