

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా హీరోయిన్ రాశీ ఖన్నా ఆలపించిన ‘శివ్ కైలాషోం కే వాసి’ భక్తిగీతం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శివుడిపై తనకు ఉన్న ఆత్మీయ భక్తిని వ్యక్తం చేస్తూ ఆమె ఈ పాటను ఎంతో భావోద్వేగంతో ఆలపించారు. ఈ గానం అహంకారాన్ని తొలగించి, అంతరంగాన్ని మేల్కొలిపి, పరమశక్తి అయిన మహాదేవునిపై సమర్పణ భావాన్ని ప్రతిబింబించే ప్రార్థనలా అనిపించిందని ఆమె తెలిపారు. మహా శివరాత్రి వంటి పవిత్ర రోజున ఈ పాట పాడటం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ద్వారా ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన రాశీ, ఈ భక్తిగీతంతో అభిమానులకు మరింత దగ్గరయ్యారు. ఆమె వినయం, ప్రశాంతమైన భావ ప్రకటన, మృదువైన స్వరం ఈ పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రస్తుతం ఆమె ఒక బాలీవుడ్ నటుడితో కలిసి ఓ చిత్రంలో నటిస్తుండగా, పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో పాటు ‘ఫర్జీ’ రెండో భాగంలో కనిపించనున్నారు. అలాగే విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్, విక్రాంత్ మాస్సే, ఆర్. మాధవన్‌లతో పలు ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!