

GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శిరీష సమర్పణలో రూపొందుతున్న కొత్త చిత్రం ‘R’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. దర్శక–నిర్మాత గోలి రామకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గాలి బాల కిరణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా నేడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో సంతోష్ కృష్ణన్, భాగ్య రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, దుర్గమ నాయుడు, పవన్, సిరి, సంధ్య, భాను చందర్, స్వాతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా అశోక రెడ్డి కంకల్ల, ఎడిటర్‌గా మునీష్, కొరియోగ్రాఫర్‌గా శివాజీ పనిచేస్తున్నారు. చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా కడవకల్లు గణేష్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా వేదాంత్ రాజ్ వ్యవహరిస్తున్నారు. ఈ నెల 20 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. రెండు షెడ్యూల్స్‌లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తిచేసి, సందేశాత్మక కథాంశంతో అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు గోలి రామకృష్ణ తెలిపారు. సహ నిర్మాత గాలి బాల కిరణ్ రెడ్డి మాట్లాడుతూ, దర్శకుడికి సినిమాపై ఉన్న మక్కువ కారణంగానే విడుదల తేదీని ముందుగానే ప్రకటించామని వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!