

హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైకాలజికల్ థ్రిల్లర్ చిత్రం నా వైఫ్ మిస్సింగ్ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. కొమర మీడియా వర్క్స్ బ్యానర్‌పై, ఆహా సమర్పణలో శివ కంఠంనేని, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “నయనం” వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన దర్శకురాలు స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథ నేపథ్యంతో కూడిన సైకాలజికల్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందుతోంది.
ఈ చిత్రంలో ప్రవీణ్, మోహిత్, సత్య శ్రీ (జబర్దస్త్) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ తొలి క్లాప్ కొట్టగా, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నీలకంఠ తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. సంగీతాన్ని సాయి కార్తీక్ అందిస్తున్నారు. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని, ‘మిస్సింగ్ వైఫ్’ మిస్టరీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!