
తమిళ చిత్రపరిశ్రమలో నిర్మాత, నటుడు, దర్శకుడు, రచయితగా గుర్తింపు పొందిన కె. రాజన్ ఆదివారం చెన్నైలోని అడయార్ వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. వృద్ధాప్యంతో వచ్చిన అనారోగ్య సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 1983లో నిర్మాతగా సినీ రంగంలోకి ప్రవేశించిన రాజన్, తరువాత దర్శకుడు, రచయితగా మారి డిస్ట్రిబ్యూటర్‌గా స్థిరపడ్డారు. 2000లో చెన్నై డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తన కుమారుడు ప్రభుకాంత్‌ను నటుడిగా పరిచయం చేశారు.
కె. రాజన్ తమిళ చిత్ర పరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచేవారు. పలువురు ప్రముఖులపై విమర్శలు చేయడం వల్ల ఇండస్ట్రీలో చాలా మందితో విభేదాలు ఏర్పడ్డాయి. ప్రభుకాంత్ 2019లో “ఎల్.కె.జి.” సినిమాతో దర్శకుడిగా మారారు. రాజన్ చివరిసారిగా 2023లో విడుదలైన “బకాసురన్” చిత్రంలో నటించారు. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!