
సినిమాలు

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు సంబంధించిన ఏనుగు దంతాల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన వద్ద ఉన్న దంతపు విగ్రహాలకు కేరళ అటవీ శాఖ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరీక్షల ద్వారా దంతాల మూలం, వాటి చట్టబద్ధతపై స్పష్టత తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.
క్షమాభిక్ష పథకం కింద తన వద్ద మొత్తం 10 ఏనుగు దంతాలు, 13 దంతపు విగ్రహాలు ఉన్నట్లు మోహన్‌లాల్ ప్రకటించారు. వాటిలో ఎక్కువ భాగం తనకు వారసత్వంగా లేదా బహుమతుల రూపంలో లభించాయని ఆయన తెలిపారు. ఈ విగ్రహాల్లో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, బాలాజీ రూపాలు ఉన్నాయని, వాటి మొత్తం బరువు సుమారు 46 కిలోలు ఉంటుందని అటవీ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వస్తువులకు సంబంధించిన చట్టబద్ధ యాజమాన్యంపై విచారణ కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!