

70 వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక శనివారం కొచ్చిలో ఘనంగా జరిగింది. ఈ ఏడాది తెలుగులో విడుదలైన చిత్రాల్లో ‘పుష్ప 2: ది రూల్’ అత్యధిక అవార్డులు దక్కించుకుని ప్రత్యేకంగా నిలిచింది. పలు ప్రధాన విభాగాల్లో ఈ చిత్రం విజయాన్ని నమోదు చేసింది. ఉత్తమ చిత్రంగా ‘పుష్ప 2: ది రూల్’ ఎంపిక కాగా, అదే చిత్రానికి ఉత్తమ దర్శకుడు అవార్డు సుకుమార్ అందుకున్నారు. ఈ సినిమాలో నటించిన అల్లు అర్జున్‌కు ఉత్తమ హీరో అవార్డు లభించింది.
క్రిటిక్స్ విభాగంలో ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) గా నిలిచింది. ‘హను-మాన్’ చిత్రంలో నటించిన తేజా సజ్జాకు ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డు దక్కింది. ఉత్తమ నటిగా ‘35 చిన్న కథ కాదు’ చిత్రానికి నివేదా థామస్ ఎంపిక కాగా, ‘సత్యభామ’ చిత్రానికి కాజల్ అగర్వాల్‌కు ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డు లభించింది.
‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో నటించిన అమితాబ్ బచ్చన్‌కు ఉత్తమ సహాయనటుడు అవార్డు దక్కగా, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రానికి అంజలి ఉత్తమ సహాయనటిగా నిలిచారు. సంగీత విభాగంలో ‘పుష్ప 2’ కు దేవి శ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు అందుకున్నారు. ‘దేవర: పార్ట్ 1’ లోని ‘చుట్టమల్లె’ పాటకు రామజోగయ్య శాస్త్రి ఉత్తమ సాహిత్యం అవార్డు అందుకున్నారు. అదే చిత్రానికి చెందిన పాటను ఆలపించిన శిల్పా రావుకు ఉత్తమ నేపథ్య గాయని అవార్డు దక్కింది.
‘గుంటూరు కారం’లోని ‘కుర్చి మడతపెట్టి’ పాటకు శ్రీ కృష్ణ ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డు అందుకోగా, అదే పాటకు శేఖర్ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు అందుకున్నారు. నూతన ప్రతిభలకు కూడా ఈసారి గుర్తింపు లభించింది. ‘కమిటీ కుర్రోల్లు’ చిత్రానికి యదు వంశీ ఉత్తమ డెబ్యూ దర్శకుడు, సందీప్ సరోజ్ ఉత్తమ డెబ్యూ నటుడు అవార్డులు అందుకున్నారు. ‘గం గం గణేశ’ చిత్రానికి నయన్ సారిక ఉత్తమ డెబ్యూ నటిగా నిలిచారు.
అలాగే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి నితిన్ జిహానీ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు అందుకోగా, ‘పుష్ప 2’ చిత్రానికి రామకృష్ణ అండ్ మోనికకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఈసారి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో తెలుగుసినిమా ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!