

టాలీవుడ్ సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ పొందుతున్న సినిమా రాజా సాబ్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.201 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
కేవలం నాలుగు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఈ సినిమాకు లభిస్తున్న నిజమైన ప్రేక్షకాభిమానానికి నిదర్శనంగా మారింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, పిల్లలు ఈ సినిమాను ఎంతో ఆస్వాదిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల చిత్రంలో జోడించిన ‘రాజా సాబ్’ పాత గెటప్ సన్నివేశాలకు కూడా అద్భుతమైన స్పందన వస్తోంది.
ప్రభాస్ వర్సటైల్ నటనతో వన్‌మ్యాన్ షోగా ఆకట్టుకోగా, హారర్–ఫాంటసీ జానర్లో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించిన దర్శకుడు మారుతి టేకింగ్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఎలాంటి రాజీ లేకుండా సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ విలువలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ‘రాజా సాబ్’కు డిమాండ్ కొనసాగుతుండగా, థియేటర్లలో హౌస్‌ఫుల్ షోస్ నమోదవుతున్నాయి. హీరోయిన్లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదే జోరు కొనసాగితే, ఫస్ట్ వీక్ ముగిసే సరికి బాక్సాఫీస్ వద్ద మరింత భారీ రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!