

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఆయనకు ప్రత్యేకంగా విషెస్ తెలియజేస్తూ చేసిన మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. “హ్యాపీ బర్త్డే బ్రో.. నువ్వు ఏం సృష్టిస్తున్నావో ప్రపంచం చూసే వరకు నేను వేచి ఉండలేకపోతున్నాను” అంటూ ప్రభాస్ చేసిన పోస్ట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
ఈ చిత్రంలో ప్రభాస్ ఇప్పటివరకు చూడని విధంగా అత్యంత పవర్ఫుల్, కఠినమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాల తర్వాత సందీప్ వంగా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తృప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ మరియు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, సౌత్ కొరియన్ స్టార్ నటుడు డాన్ లీ ఈ సినిమాలో విలన్గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’, ‘సలార్ 2’ వంటి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, ‘స్పిరిట్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!