

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనుకున్న దానికంటే ముందుగానే థియేటర్లలోకి రానుంది. చిత్ర బృందం తాజాగా ఈ సినిమాను ఈ నెల 19 న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వరుస లాంగ్ వీకెండ్లు, సెలవుల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
‘గబ్బర్ సింగ్’ తరువాత పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ భారీ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలవగా, ఎస్. తమన్ నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశిఖన్నా, పార్థిబన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బజ్ మధ్య ఈ చిత్రం అభిమానులకు థియేటర్ పండుగగా మారనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!