

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి కొత్త ముందడుగు వేస్తోంది. ఈ రెండు సంస్థలు కలిసి ప్రేక్షకులకు బలమైన, అర్థవంతమైన కంటెంట్‌ను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. గతంలోనే కథలపై చర్చలు జరగగా, తాజా భేటీతో రాబోయే ప్రాజెక్టులపై చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి.
భోగి శుభ సందర్భంగా జరిగిన ఈ సమావేశంపై ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, గతంలో ప్రారంభమైన చర్చలను కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ తో విస్తృతంగా చర్చించారని వెల్లడించింది. ఈ కలయికతో కొత్త ఆలోచనలు, కొత్త కథలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
.jpeg)
దీనికి ప్రతిస్పందనగా టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, కథలపై చర్చించేందుకు అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులకు ప్రభావవంతమైన, విలువైన సినిమాలను అందించాలనే ఉద్దేశంతో ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. ఈ కలయికతో రాబోయే ప్రాజెక్టులపై సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!