

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘డ్రాగన్’ మళ్లీ సెట్స్‌పైకి వచ్చింది. వర్కింగ్ టైటిల్‌గా ‘డ్రాగన్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో కన్నడ నటి రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తోంది.
కొంత విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించిన చిత్ర బృందం, తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌తో పాటు ఇతర ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు, హై వోల్టేజ్ యాక్షన్ ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. దాదాపు మూడు వారాల పాటు ఈ షూటింగ్ షెడ్యూల్ కొనసాగనుందని సమాచారం.
ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఎన్టీఆర్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. స్లిమ్ లుక్‌లో కనిపించనున్న ఆయన, ఈ చిత్రంలో రెండు భిన్నమైన గెటప్‌లలో ప్రేక్షకులను అలరించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25న ‘డ్రాగన్’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!