
టెక్నాలజీ

ఎంత పని ఒత్తిడి ఉన్నా ఆరు నెలలకోసారి స్నేహితులను కలవడం తన అలవాటేనని ప్రముఖ నటుడు రజనీకాంత్ తెలిపారు. కోయంబత్తూర్లోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం లో 1975–79 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వంద మందికి పైగా పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ పంపిన అభినందన వీడియోను కార్యక్రమంలో ప్రదర్శించారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న అనేక మంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
బంధువులు ఉన్నా, స్నేహితులను కలవడంలో ఉండే ఆనందం ప్రత్యేకమని చెప్పారు. తాను తన అసలు పేరు శివాజీ’ ని చాలాసార్లు మర్చిపోయినా, స్నేహితులు అదే పేరుతో పిలవడం తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని రజనీకాంత్ అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!