

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత హీరోయిన్ నివేదా థామస్ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘శ్రీమతి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో నివేదా థామస్ మధ్యతరగతి గృహిణి పాత్రలో కనిపిస్తున్నారు. కిచెన్ నేపథ్యంలో రూపొందిన ఫస్ట్ లుక్.. ప్రతి ఇంటి గృహిణి జీవితానికి దగ్గరగా ఉండే కథాంశంతో సినిమా తెరకెక్కుతున్నట్లు సూచిస్తోంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
‘స్కైలాబ్’ ఫేమ్ విశ్వక్ ఖండేరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2024లో విడుదలైన ‘35 – చిన్న కథ కాదు’ సినిమాతో నివేదా థామస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు కొంత విరామం తీసుకున్న ఆమె.. ఇప్పుడు ‘శ్రీమతి’తో తిరిగి వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!