

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం డ్రామా చేస్తోందని విమర్శించారు. ఈ రిజర్వేషన్లు కోర్టులో నిలబడవని ప్రభుత్వానికి తెలుసని, అందుకే దానిని సాకుగా చూపి స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదని జగన్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైలుకు పంపడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రోజుకో డ్రామా, నటన, డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగినా వైఎస్సార్‌సీపీ ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగితే వైఎస్సార్‌సీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేసిన జగన్.. ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా పార్టీ శ్రేణులు గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!