
సినిమాలు

కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా భారతరత్న, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావుకు నోటీసులు అందినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. పాత ఓటర్ల జాబితాలో ఆయన పేరు “Prof CNR Rao”గా ఉండగా.. కొత్త జాబితాలో ఒక అదనపు అక్షరం చేరిందని, ఈ పేరులోని తేడాను సరిచేసుకునేందుకు బెంగళూరులోని మల్లేశ్వరం కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు కథనాలు వెల్లడించాయి.
అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని కర్ణాటక ఎన్నికల ముఖ్య అధికారి స్పష్టం చేశారు. దేశానికి సీఎన్‌ఆర్ రావు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు. సీఎన్‌ఆర్ రావు కార్యాలయ ప్రతినిధి కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. సీఎన్‌ఆర్ రావుకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!