

అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ టెక్నాలజీస్ తమ వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మరింత కఠినతరం చేసింది. ఇటీవల గ్లోబల్ కార్పొరేట్ సిబ్బందిలో దాదాపు 10 శాతం మందిని తొలగించిన సంస్థ.. సుమారు 3,300 ఉద్యోగాలపై వేటు వేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై కేవలం 1 శాతం మంది కార్పొరేట్ ఉద్యోగులకే పూర్తిస్థాయి వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం లభించనుంది. మిగతా ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయం నుంచి పనిచేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగులు తమ బృందాలతో సమన్వయంగా పనిచేసేందుకు ఆయా ప్రాంతాలకు మారాలని ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ఇ-మెయిల్ ద్వారా సూచించారు. న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రత్యేక కార్యాలయ హబ్‌లను ఏర్పాటు చేసిన సంస్థ.. మేనేజర్లు, వారి కింద పనిచేసే సిబ్బంది ఒకే ప్రాంతంలో ఉండేలా చర్యలు చేపడుతోంది. మేనేజ్‌మెంట్‌లో అనవసరమైన లేయర్లను తొలగించడం, రైడ్ షేరింగ్, డెలివరీ, రోబోట్యాక్సీ విభాగాల్లో పెట్టుబడులను సమీక్షించడం వంటి చర్యల్లో భాగంగానే ఈ మార్పులు చేపట్టినట్లు ఉబర్ తెలిపింది. ఈ నిబంధనలు కేవలం కార్పొరేట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి; డ్రైవర్లు, ఇతర సిబ్బందిపై ప్రభావం ఉండదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!