

బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ఒకటి. అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో టబు, శ్రియ, జైదీప్ అహ్లావత్, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
మలయాళంలో వచ్చిన ‘దృశ్యం 3’కు పూర్తి భిన్నమైన క్లైమాక్స్‌తో హిందీ వెర్షన్‌ను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు ముగింపు పలకనున్నారు. ట్రైలర్‌లో మరోసారి ఉత్కంఠభరితమైన మలుపులకు సంకేతాలు కనిపించడంతో, చివర్లో ఎలాంటి ట్విస్ట్‌తో కథను ముగిస్తారనే ఆసక్తి నెలకొంది. దీనికి సమాధానం తెలియాలంటే అక్టోబరు 2 వరకు వేచి చూడాల్సిందే.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!