

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, అనంతరం నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు పొందిన నిహారిక కొణిదెల ప్రస్తుతం తన కెరీర్‌లో ఉత్సాహభరితమైన దశలో ఉన్నారు. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ విజయవంతం కావడంతో, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘రాకాస’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రంపై నిహారిక విశ్వాసంగా ఉన్నారు. హర్రర్ కామెడీతో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా వచ్చే నెల 3న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రం కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందించిన క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని నిహారిక తెలిపారు. సంగీత్ శోభన్‌తో ఆమెకు ఇదివరకు ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే విజయవంతమైన వెబ్ సిరీస్ అనుభవం ఉండగా, అదే కాంబినేషన్‌లో ఇప్పుడు సినిమా రావడం విశేషంగా నిలుస్తోంది. కంటెంట్ పరంగా వినోదంతో పాటు విభిన్నమైన అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆమె వెల్లడించారు.
ఇక నటనకు కొంతకాలంగా దూరంగా ఉన్న నిహారిక, మళ్లీ కెమెరా ముందు నిలవాలని నిర్ణయించుకున్నారు. తాజా ప్రమోషన్లలో మాట్లాడుతూ, తన రెండో ఇన్నింగ్స్‌పై స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం పలు కథలను వింటున్నానని, వాటిలో కొన్ని స్క్రిప్ట్స్ తనకు బాగా నచ్చాయని చెప్పారు. అన్ని అనుకూలంగా జరిగితే 2027లో మళ్లీ హీరోయిన్‌గా వెండితెరపై కనిపించే అవకాశం ఉందని నిహారిక వెల్లడించారు.








.png&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!