

ఫస్ట్ కాపి మూవీస్, కేడీ&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్‌బాబు నిర్మిస్తున్న ‘మిస్సింగ్ మేఘన’ చిత్రం నుంచి తొలి పాట ‘పిల్ల పిల్ల పిల్ల’ను ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు విడుదల చేశారు. వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించగా, శామ్.కె. నాయుడు ఛాయాగ్రహణం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు బెక్కం వేణుగోపాల్ పాల్గొన్నారు.
పాటను విడుదల చేసిన సురేష్‌బాబు.. ‘పిల్ల పిల్ల పిల్ల’ పాట బాగుందని ప్రశంసిస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు వాచస్పతి, నిర్మాత నరేష్‌బాబు, హీరో రామ్ కార్తీక్, సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ మాట్లాడుతూ సురేష్‌బాబు చేతుల మీదుగా తొలి పాట విడుదల కావడం ఆనందంగా ఉందన్నారు. జావేద్ అలీ ఈ పాటకు గాత్రం అందించగా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!