

తమిళ స్టార్ హీరో కార్తీ ఇప్పుడు తెలుగులో నేరుగా ఓ భారీ ప్రాజెక్ట్‌తో రాబోతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ‘మ్యాడ్’ సినిమాతో యువతను ఆకట్టుకున్న కళ్యాణ్ శంకర్, ఈసారి పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ను సిద్ధం చేస్తున్నారని సమాచారం. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథ, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను సమతూకంగా మిళితం చేసిన స్క్రిప్ట్‌తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఈ సినిమాకు మరో క్రేజీ అప్డేట్గా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మరియు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కెమెరా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. తన ప్రత్యేక విజువల్ స్టైల్‌తో గుర్తింపు పొందిన కార్తీక్, ‘మిరాయ్’లో చూపించిన విజువల్ ఎలివేషన్స్‌కు మంచి ప్రశంసలు అందుకున్నారు. మొదటగా ఆయన చందూ మొండేటి తెరకెక్కించాల్సిన ‘వాయుపుత్ర’ యానిమేషన్ ప్రాజెక్ట్‌కు పని చేయాల్సి ఉండగా, భారీ బడ్జెట్ కారణాల వల్ల ఆ సినిమా నిలిచిపోవడంతో నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌కు తీసుకువచ్చినట్లు సమాచారం. కార్తీ పాత్ర కూడా ఈ సినిమాలో భిన్నంగా ఉండబోతుందని టాక్. త్వరలో హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!