

భీమవరం జెపి రోడ్డులో గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ (Goyaz Silver Jewellery) కొత్త షోరూంను సినీనటి నేహా శెట్టి (Neha Shetty) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘‘ఇప్పటివరకు 20 షోరూమ్‌లు ఉన్నాయి, అందులో నేను ప్రారంభిస్తున్నది 3వ స్టోర్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు వడ్డాణం అంటే చాలా ఇష్టం, ఇక్కడ వడ్డాణం కలెక్షన్లను చూసి అన్ని కొనాలనిపిస్తోంది’’ అని చెప్పారు.
నేహా శెట్టి తెలిపినట్లుగా, గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 19 స్టోర్లతో విస్తరించగా, భీమవరం 20వ స్టోర్‌గా ప్రారంభమైంది. యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరమని, షోరూంలో మంచి సిల్వర్ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
నిర్వాహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి మాట్లాడుతూ, అతి తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొందిన ఏకైక సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయజ్ అని, వెండి ఆభరణాలు సులభంగా అందుబాటులో ఉంటాయని అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!