
జనరల్

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పుడు తన ప్రత్యేక నటనతో గుర్తింపు పొందిన వడ్డే నవీన్ దాదాపు పదేళ్లకు పైగా విరామం తర్వాత మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం “ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు” ద్వారా రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో ఆయన రీఎంట్రీపై ఆసక్తి మరింత పెరిగింది.
ఈ చిత్రానికి కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వడ్డే నవీన్ నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నారు. రాశి సింగ్ కథానాయికగా నటిస్తుండగా, రఘుబాబు, శివన్నారాయణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 19న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం వడ్డే నవీన్ రెండో ఇన్నింగ్స్‌కు బలమైన ఆరంభం అవుతుందా అనే ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!