
జనరల్

ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'ఇడుపు కాయితం' ఇటీవల ప్రారంభమైంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో కొందరు చేసిన పోస్టులు వివాదానికి దారితీశాయి. టైటిల్ అర్థం, పదప్రయోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదంపై సీనియర్ నటుడు నరేశ్ స్పందిస్తూ, సినిమాను సినిమాగానే చూడాలని సూచించారు. కరుప్పు, కాంతార వంటి చిత్రాల పేర్ల అర్థం అందరికీ తెలియకపోయినా ప్రేక్షకులు వాటిని ఆదరించి విజయవంతం చేశారని గుర్తు చేశారు. అనవసర వివాదాలకు తెరదించి, తెలుగు భాషను గౌరవిస్తూ మంచి సినిమాలను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!