

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏపీ గ్రీన్ చైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో పర్యావరణ హిత కార్యక్రమం నిర్వహించారు. బహిరంగ ప్రదేశంలో పలు మొక్కలు నాటి పుట్టినరోజు వేడుకలను ప్రకృతితో ముడిపెట్టారు.
ఈ సందర్భంగా కడియం నర్సరీల నుంచి తెచ్చిన కదంబ వృక్షాన్ని కూడా నాటారు. పచ్చని ఆకులతో ఉండే ఈ చెట్టు మంచి నీడను అందించడంతో పాటు పర్యావరణానికి ఉపయోగకరంగా ఉంటుందని నాగబాబు తెలిపారు. అభిమానులు, ప్రజలు తమ ఆత్మీయుల పుట్టినరోజుల సందర్భంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
తన కుటుంబ సభ్యులైన పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక తదితరుల పేర్లతో ఇప్పటికే 120కిపైగా మొక్కలు నాటినట్లు నాగబాబు వెల్లడించారు. పుట్టినరోజులను పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా జరుపుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు పచ్చని కానుక అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!