

నేడు నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా అతని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NC24 కు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విరూపాక్ష దర్శకత్వంతో గుర్తింపు పొందిన కార్తిక్ దండు ఈ చిత్రానికి వృషకర్మ అనే శక్తివంతమైన శీర్షికను పెట్టారు. ధర్మసంబంధమైన కార్యాలు చేసే వ్యక్తి అనే అర్థం వచ్చే ఈ శీర్షిక, చైతన్య పాత్రకు పూర్తిగా సరిపోతుంది.
విడుదలైన ఫస్ట్ లుక్‌లో చైతూ పూర్తిగా మారిపోయిన లుక్‌తో కనిపిస్తున్నాడు. చేతిలో రాడ్ పట్టుకుని, చినిగిన టీ-షర్ట్‌లో కఠినమైన హావభావాలతో నిలబడ్డ అతని లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. నేపథ్యంలో పాత నిర్మాణాలు, దుమ్ముతో నిండిన వాతావరణం పోస్టర్‌కు మరింత రా, గ్రిట్టీ టోన్‌ను జోడిస్తున్నాయి. అతని మస్క్యులర్ లుక్ మరియు కొత్త హెయిర్‌స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పుట్టినరోజు శుభాకాంక్షలతో సూపర్‌స్టార్ మహేష్ బాబు టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. SVCC మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ సెట్‌పై చిత్రీకరణ కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!