
సినిమాలు

నాగచైతన్య తన కొత్త చిత్రం వృశకర్మలో నటించేందుకు అంగీకరించడానికి గల కారణాలను వెల్లడించారు. ఈ సినిమాలోని పాత్రలు, భారీ సెట్లు, దర్శకుడు కార్తిక్ దండు ప్రతి అంశాన్ని ఎంతో శ్రద్ధగా తెరకెక్కిస్తున్న తీరు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్‌పై కూడా తనకు నమ్మకం కలిగిందని, ఇవన్నీ సినిమా అంగీకరించడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని చైతన్య పేర్కొన్నారు.
పురాణాలు, సాహసం, ఉత్కంఠ, సస్పెన్స్ అంశాలను దర్శకుడు ఒకే కథలో అద్భుతంగా మేళవించారని నాగచైతన్య ప్రశంసించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు భిన్నమైన సినిమాటిక్ అనుభూతిని అందించనున్న ఈ చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!