26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

Writer: Chandrika 02:29 PM, 26 నవంబర్, 2026
ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై హెచ్చరిక లేబుల్స్ అమలు చేయడంలో జాప్యంపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)ను సుప్రీంకోర్టు మందలించింది. అధిక చక్కెర, కొవ్వు, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను వినియోగదారులు సులభంగా గుర్తించేలా స్పష్టమైన హెచ్చరికలు ఉండాలని సూచించింది. జస్టిస్ పార్థీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం.. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని FSSAI కోరుకోవడం లేదా? అని ప్రశ్నించింది. ఆహార ఉత్పత్తుల్లో అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న విషయాన్ని తెలియజేసేలా ప్యాకెట్ల వెనుక భాగంలో కాకుండా ముందు భాగంలో ఎరుపు రంగు షట్కోణ గుర్తులను ముద్రించాలని ఆదేశించింది. ఈ విషయంలో గతంలో FSSAI చేసిన ప్రతిపాదనలను మరింత కఠినతరం చేయాలని సూచించింది.

దేశంలో మధుమేహం, ఊబకాయం సమస్యలు పెరుగుతుండటం, పిల్లలు సైతం అధికంగా ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను తీసుకుంటుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 2022 నుంచి ఈ నిబంధనల అమలులో జాప్యం జరగడంపై అసహనం తెలిపింది. ఆహార ఉత్పత్తుల కంపెనీలకు నిబంధనలు పాటించేందుకు 365 రోజుల స్వచ్ఛంద గడువు ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యాపార ప్రయోజనాల కంటే ప్రజారోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. వినియోగదారులు తాము కొనుగోలు చేసే ఆహార పదార్థాల నాణ్యత, పోషక విలువలపై అవగాహనతో నిర్ణయం తీసుకునేలా స్పష్టమైన హెచ్చరికలు అవసరమని పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు

చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు

ప్రైవేట్ పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహణపై హరీశ్ రావు ఆగ్రహం

ప్రైవేట్ పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహణపై హరీశ్ రావు ఆగ్రహం

వైభవంగా వైఎస్ అంజిలీ రెడ్డి, రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక

వైభవంగా వైఎస్ అంజిలీ రెడ్డి, రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక

తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్

తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్

బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు

బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు

ట్యాగ్లు
సుప్రీంకోర్టుFSSAIప్యాకేజ్డ్ ఫుడ్హెచ్చరిక లేబుల్స్ఆహార భద్రతఅధిక చక్కెర ఆహారాలుఅధిక కొవ్వు పదార్థాలుఅధిక ఉప్పు పదార్థాలుప్రజారోగ్యంఆహార నియంత్రణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య
జనరల్

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..
జనరల్

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతున్న అఖిల్ ‘లెనిన్’
సినిమాలు

జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతున్న అఖిల్ ‘లెనిన్’

మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన ప్రియాంక జైన్!
షోస్

మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన ప్రియాంక జైన్!

రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి విక్రమార్క
రాజకీయాలు

రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి విక్రమార్క

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!
జనరల్

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అమెరికా చిన్నారులకు ఎలాన్ మస్క్ అదిరిపోయే గిఫ్ట్
బిజినెస్

అమెరికా చిన్నారులకు ఎలాన్ మస్క్ అదిరిపోయే గిఫ్ట్

వృశకర్మ కథలో నాగచైతన్యను అంతగా ఆకట్టుకున్న అంశాలివే!
సినిమాలు

వృశకర్మ కథలో నాగచైతన్యను అంతగా ఆకట్టుకున్న అంశాలివే!

చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు
జనరల్

చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు

టెస్టు క్రికెట్‌లో వియాన్ ముల్డర్ అరుదైన రికార్డు..
క్రీడలు

టెస్టు క్రికెట్‌లో వియాన్ ముల్డర్ అరుదైన రికార్డు..

రాంచీలో మరో విలాసవంతమైన ఇంటిని నిర్మించనున్న ఎంఎస్ ధోనీ
క్రీడలు

రాంచీలో మరో విలాసవంతమైన ఇంటిని నిర్మించనున్న ఎంఎస్ ధోనీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!