

అఖిల్ అక్కినేని తదుపరి చిత్రం ‘లెనిన్’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఓ సర్‌ప్రైజ్ అప్‌డేట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ‘లెనిన్’ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేయనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. డిసెంబర్ 11, 2026న అక్కడి థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రకటనతో పాటు చిత్రానికి సంబంధించిన అధికారిక గ్లింప్స్‌ను విడుదల చేయడంతోపాటు, జపాన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. జపాన్ ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుంది? చిత్రబృందం అక్కడికి వెళ్లి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తుండగా, ప్రమోద్ పంజు, శివాజీ, ఈశ్వరీ రావు, సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జపాన్‌లో విడుదల కానుండటంతో ‘లెనిన్’కు అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందోనని అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!