

బడ్డీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఈ నగేంటి’ రిపీట్ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధిస్తోంది. విడుదలైన ఏడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను చేరుకోవడంతో నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో పాటు చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ చిత్రం తొలి ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.51.8 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సినిమా ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన చిత్రబృందం, రానున్న రోజుల్లోనూ ఇదే ఆదరణ కొనసాగుతుందని ఆశిస్తోంది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించడంతో చిత్రబృందం ఉత్సాహంగా ఉంది. ఇక రానున్న రోజుల్లో సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!