

టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా గ్రూప్‌లో నెలకొన్న వివాదం మరింత ముదిరింది. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు ఛైర్మన్‌గా కొనసాగించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (ఎస్‌డీటీటీ), ఆర్‌డీ టాటా ట్రస్ట్ (ఆర్‌డీటీటీ) గురువారం బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నిర్ణయం వల్ల జరిగిన నష్టానికి పరిహారంగా ఎస్‌డీటీటీ రూ.50 కోట్లు, ఆర్‌డీటీటీ రూ.15 కోట్లు చెల్లించాలని, దీనికి 18 శాతం వార్షిక వడ్డీ కూడా ఇవ్వాలని పిటిషన్‌లో కోరాయి. సెప్టెంబర్ 17న చంద్రశేఖరన్ పునర్నియామకానికి సంబంధించి టాటా సన్స్ బోర్డు ఆమోదించిన తీర్మానం చెల్లదని ట్రస్టులు వాదిస్తున్నాయి. కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని 121వ నిబంధన ప్రకారం అవసరమైన అనుకూల ఓట్లు లభించలేదని పేర్కొన్నాయి. ఈ పిటిషన్‌పై సింగిల్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
టాటా ట్రస్ట్స్‌కు టాటా సన్స్‌లో 66 శాతం వాటా ఉంది. నోయల్ టాటా నేతృత్వంలోని ట్రస్టులు.. కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం ఛైర్మన్ నియామకానికి బోర్డులోని ఇద్దరు నామినీ డైరెక్టర్ల అనుకూల ఓట్లు తప్పనిసరి అని చెబుతున్నాయి. అయితే, ట్రస్టుల నామినీ డైరెక్టర్ నోయల్ టాటా చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని వ్యతిరేకించగా, వేణు శ్రీనివాసన్ అనుకూలంగా ఓటు వేసినట్లు సమాచారం. దీంతో అవసరమైన ఆమోదం లభించలేదని ట్రస్టులు వాదిస్తున్నాయి. సెప్టెంబర్ 17 తర్వాత టాటా సన్స్‌కు పంపిన లేఖలకు సానుకూల స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించాలని రెండు ట్రస్టులు నిర్ణయించాయి. నవంబర్ 30న జరగనున్న బోర్డు సమావేశంలో ఛైర్మన్ హోదాలో చంద్రశేఖరన్ ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకోవడం కూడా ఈ పిటిషన్ వెనుక ఉద్దేశమని తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!