

తమిళ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ప్రస్తుతం తన దర్శకత్వ అరంగేట్రంతో వార్తల్లో నిలుస్తున్నారు. తండ్రి బాటలో నటుడిగా కాకుండా మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘సిగ్మా’తో జేసన్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తల్లి సంగీత తన జీవితంలో అతిపెద్ద బలమని, ఆమె ఎప్పుడూ తన గురించి, తన సోదరి గురించి ఆలోచిస్తుంటారని చెప్పారు.
తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని పంచుకోలేనని, చిన్నప్పటి నుంచి వ్యక్తిగత విషయాలపై వారికి అంతగా స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఉండేది కాదని జేసన్ తెలిపారు. అయితే తన సోదరితో మాత్రం ఏ విషయాన్నైనా ఓపెన్‌గా మాట్లాడగలనని, ఆమె తన బెస్ట్ కాన్ఫిడెంట్ అని వెల్లడించారు. తన తండ్రి విజయ్ స్వయంకృషితో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం పట్ల ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఇతరుల ప్రభావానికి లోనుకాకుండా సొంతంగా కష్టపడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని విజయ్ తనకు సూచించారని తెలిపారు. సిగ్మాలో సందీప్ కిషన్‌తో పాటు సంపత్, రాజు సుందరం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!