

దేశీయంగా తయారయ్యే తొలి పౌర విమానం మరో రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం నిర్వహించిన ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భారత దేశీయ విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం దేశీయ విమానయాన సంస్థలు 1,600కు పైగా విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయని, వాటి విలువ సుమారు 10,000 కోట్ల డాలర్లుగా ఉందని తెలిపారు.
వచ్చే పదేళ్లలో దేశంలో 100కు పైగా కొత్త విమానాశ్రయాలు ఏర్పడే అవకాశం ఉందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రస్తుతం దేశంలో 165 విమానాశ్రయాలు ఉండగా, దేశీయ విమానయాన సంస్థల వద్ద దాదాపు 850 విమానాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉందన్నారు. దేశంలో జెట్ ఇంజిన్ల తయారీకి ఉన్న అవకాశాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!