
జనరల్

మోహన్‌లాల్ కీలక పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ, ఈ కథ 13 ఏళ్లుగా కొనసాగుతోందని, జార్జ్‌కుట్టి పాత్ర ప్రతి కదలిక ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈసారి క్లైమాక్స్ ప్రత్యేకంగా ఉంటుందని, రెండు కుటుంబాల భావోద్వేగాలు ప్రధానంగా చూపించామని తెలిపారు. ‘దృశ్యం 3’ విజయవంతమైతే 4, 5 భాగాలు కూడా రావచ్చని, నిర్మాత ఆంటోనీకి కూడా అదే ఉత్సాహం ఉందని చెప్పారు. దర్శకుడు జీతూ జోసెఫ్ మాత్రం ప్రేక్షకులు ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా సినిమాను చూడాలని సూచించారు. ట్రైలర్లో పోలీసులకు కూడా సవాలు ఎదురైన కేసును మీడియా దర్యాప్తు చేస్తుందని సంకేతాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!