

ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోను విశేష ఆదరణ పొందిన నరసింహా అవతార్ అనంతరం, మరో భారీ యానిమేషన్ ఫీచర్ ఫిలిం థియేటర్లలోకి రానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఈ హై-బడ్జెట్ యానిమేటెడ్ చిత్రం మిషన్ సాంటా. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న భారత్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.
అంతర్జాతీయ విడుదలలో భాగంగా, అదే రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల థియేటర్లలో కూడా మిషన్ సాంటా సందడి చేయనుంది. కుటుంబ సమేతంగా వీక్షించదగ్గ కథతో రూపొందిన ఈ హై ఎనర్జీ యానిమేటెడ్ అడ్వెంచర్ చిత్రం, అద్భుతమైన యానిమేషన్ క్వాలిటీతో పాటు ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, సాహసకథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన థియేట్రికల్ అనుభవాన్ని అందించనుంది.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రులు, తాతముత్తాతలు కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది. అద్భుతమైన విజువల్స్, వేగవంతమైన కథనం, హృదయాన్ని తాకే భావోద్వేగాలు, థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ ఈ చిత్ర ప్రధాన ఆకర్షణలు. భారతీయ యానిమేషన్ రంగానికి మైలురాయిగా నిలవనున్న ఈ సినిమాకు కథ, స్క్రిప్ట్, క్యారెక్టర్ డిజైన్‌ను లాస్ ఏంజిల్స్‌లో అభివృద్ధి చేయగా, పూర్తి యానిమేషన్ ప్రొడక్షన్‌ను భారతదేశంలోనే సీనియర్ యానిమేషన్ నిపుణుల పర్యవేక్షణలో పూర్తి చేశారు. సుమారు 20 నెలల పాటు 150కి పైగా భారతీయ యానిమేషన్ నిపుణులు ఈ ప్రాజెక్ట్‌పై పనిచేశారు. బ్రాడ్‌విజన్ ఇండియా, స్టూడియో56 సంస్థలు భారతీయ యానిమేషన్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇంగ్లీష్ భాషలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రీమియం యానిమేటెడ్ అనుభవాన్ని అందించనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!