

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో అమెరికా తన సైనిక ఉనికిని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మూడో విమాన వాహక నౌక స్ట్రైక్ గ్రూప్‌తో పాటు అదనపు మెరైన్ కార్ప్స్ నౌకలను ఈ ప్రాంతానికి తరలిస్తోంది. యూఎస్‌ఎస్ థియోడర్ రూజ్‌వెల్ట్ సెప్టెంబర్ 27న సాన్ డియాగో నుంచి బయలుదేరింది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. ఈ మోహరింపులో అదనంగా 9,000 నుంచి 10,000 మంది నేవీ, మెరైన్స్ సిబ్బంది ఉండొచ్చని తెలుస్తోంది. వీరు, నౌకలు నవంబర్ చివరి నాటికి ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది.
థియోడర్ రూజ్‌వెల్ట్ చేరుకుంటే పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్న యూఎస్‌ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్, యూఎస్‌ఎస్ జార్జ్ వాషింగ్టన్ విమాన వాహక నౌకలతో కలిసి అమెరికా నౌకాదళ ఉనికి మరింత పెరగనుంది. ప్రస్తుతం ప్రాంతానికి వెళ్తున్న నౌకల్లో 7,000 మందికి పైగా నేవీ సిబ్బంది, సుమారు 2,000 మంది మెరైన్స్ ఉన్నట్లు అమెరికా అధికారి తెలిపారు. మొత్తం మీద పశ్చిమాసియా ప్రాంతంలో 50,000 మందికి పైగా అమెరికా సైనిక సిబ్బంది ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే 20,000 మందికి పైగా నేవీ, మెరైన్స్ సిబ్బంది, వందల సంఖ్యలో సైనిక విమానాలు ఈ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!