

సుదూర ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని అందించే దిశగా వందేభారత్ స్లీపర్ సేవలు మరో కీలక మార్గంలోకి విస్తరించనున్నాయి. ముంబయి-బెంగళూరు మధ్య కొత్త వందేభారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రారంభ తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రైలు రెండు నగరాల మధ్య రాత్రి ప్రయాణానికి వేగవంతమైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది.
బెంగళూరు నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు ముంబయి చేరేలా షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది. ముంబయి నుంచి రాత్రి 10.30 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు బెంగళూరు చేరుకోనుంది. ప్రయాణ సమయం సుమారు 16 గంటలు. మార్గమధ్యంలో అనంతపురం, గుంతకల్లు, రాయచూర్, కలబురగి, సోలాపూర్, పుణె, కల్యాణ్ స్టేషన్లలో హాల్టులు ఉండనున్నట్లు సమాచారం. వారానికి ఆరు రోజులు ఈ సేవ నడిచే అవకాశం ఉంది. కాగా, దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలు కమర్షియల్ సర్వీసులు జనవరి 2026లో కామాఖ్య-హావ్‌డా మార్గంలో ప్రారంభమయ్యాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!