
జనరల్

దళపతి విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జన నాయకుడు’ విడుదల అనంతరం మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ రెండో రోజు బాక్సాఫీస్ వద్ద మంచి జోరు కొనసాగిస్తోంది. తమిళంతో పాటు తెలుగులో ‘జన నాయకుడు’, హిందీలో ‘జన్ నేత’ పేర్లతో విడుదలైన ఈ చిత్రం మూడు భాషల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆకట్టుకుంటోంది. బుక్ మై షో గణాంకాల ప్రకారం టికెట్ విక్రయాలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తమిళ వెర్షన్‌కు గంటకు 20 వేలకుపైగా టికెట్లు బుక్ అవుతుండగా, తెలుగు వెర్షన్‌కు సుమారు 2 వేల బుకింగ్స్, హిందీ వెర్షన్‌కు వెయ్యికిపైగా బుకింగ్స్ నమోదవుతున్నాయి. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతుండగా, వీకెండ్‌లో ఈ సినిమా మూడు భాషల్లోనూ మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!