

దళపతి విజయ్ చివరి చిత్రంగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జన నాయగన్’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.80 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా చూస్తే ఇది మంచి ఓపెనింగ్ అయినప్పటికీ, విజయ్ స్థాయికి, ఆయన గత చిత్రాల రికార్డులతో పోలిస్తే అంచనాలకు తగ్గట్లుగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాకు ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు రావడంతో పాటు సెకండాఫ్, విలన్ ట్రాక్‌పై ప్రధానంగా విమర్శలు వినిపిస్తున్నాయి. వరుస వాయిదాలు, పైరసీ కూడా తొలిరోజు వసూళ్లపై ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
విజయ్‌కు ఉన్న భారీ క్రేజ్‌తో పాటు ఆయన చివరి చిత్రంగా ప్రచారం జరగడంతో ‘జన నాయగన్’పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో సినిమా వసూళ్లు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకుల మౌత్ టాక్, వీకెండ్ వసూళ్లు సినిమా బాక్సాఫీస్ ప్రయాణంలో కీలకంగా మారనున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!