
క్రీడలు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాను ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని తెలిపారు. వయసు పెరగడం, ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తనకు 79 ఏళ్లు అని, పదవీకాలం ముగిసే నాటికి తన వయసు 81 నుంచి 82 ఏళ్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు.
1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణం 2028 నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని సిద్ధరామయ్య తెలిపారు. గతంలో ఎన్నికల్లో ప్రజలే స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చేవారని, ప్రస్తుతం ఎన్నికల విధానం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చురుకుగా కొనసాగుతూ ప్రజల తరఫున తన గళాన్ని వినిపిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!