
జనరల్

టాలీవుడ్ అగ్ర నటుడు మహేశ్‌బాబు ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసిన ఆయన, సినిమా ట్రైలర్, పాటలు తనకు ఎంతో నచ్చాయని పేర్కొన్నారు. దర్శకుడు అజయ్ భూపతి నటీనటులను చక్కగా చూపించారని ప్రశంసించారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం అద్భుతంగా ఉందని, ‘అలెల్లే అలెల్లే’ పాట తనకు ప్రత్యేకంగా నచ్చిందని తెలిపారు.
జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో రషా థడానీ కథానాయికగా నటిస్తున్నారు. వైజయంతి బ్యానర్ ద్వారా జయకృష్ణ వెండితెరకు పరిచయం కావడం సంతోషంగా ఉందని మహేశ్‌బాబు పేర్కొన్నారు. అభిమానులు జయకృష్ణ, రషాను ప్రోత్సహించాలని కోరుతూ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ చిత్రం జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!