
జనరల్

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆబ్జెక్షన్ మై లార్డ్ – నోటరీ పరశురామ్: చాప్టర్ 1’ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో ముఖేష్ రిషి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జీ5 వేదికగా జూలై 31 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. విడుదల చేసిన పోస్టర్ సిరీస్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది.
పోస్టర్‌లో శ్రీకాంత్, ముఖేష్ రిషి ఒకరినొకరు తీవ్రంగా ఎదుర్కొంటున్న దృశ్యం, అలాగే మంటల్లో చిక్కుకున్న వ్యక్తి విజువల్ కథపై ఉత్కంఠను పెంచుతోంది. న్యాయం, నేరం, కుట్రల నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌కు సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించగా, డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించారు. అరుణ్ చిలువేరు సంగీతాన్ని అందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!