
జనరల్

సీన్ సెటర్స్, అసెంబ్లీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సంగీత వేడుక “ది నైట్ ఆఫ్ ది స్టార్స్” ఈ నెల 12, 2026న హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అసెంబ్లీలో జరగనుంది. కళ్యాణి మాలిక్, గీతా మాధురి, సాకేత్, వినూత్న, కశ్యప్, అదితి, భార్గవి తదితరులు తమ సంగీత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ నిర్వహిస్తున్నారు.
మీడియా సమావేశంలో నిఖిల్ మాట్లాడుతూ చిన్ననాటి నోస్టాల్జిక్ పాటలను తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ ఈ షో తన మొదటి సినిమా ఆనందాన్ని గుర్తు చేస్తోందని చెప్పారు. గీతా మాధురి లైవ్ మ్యూజిక్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!