

సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు తన కెరీర్‌లో 50వ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందించే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విజయ్ నటించిన ‘జన నాయకన్’ సినిమాను నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు సూర్య 50ను కూడా గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడి ఎంపికపై చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు సూర్య ప్రస్తుతం విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రీకరణలో పాల్గొంటుండగా, సూర్య 47 షూటింగ్ కూడా కొనసాగుతోంది. అలాగే ‘కరుప్పు’ సీక్వెల్‌పై కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో రాబోయే రెండేళ్లలో సూర్య నుంచి వరుస సినిమాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!